‘అల్లరి’ నరేశ్ హీరోగా రూపొందిన ‘12ఎ రైల్వే కాలనీ’ థియేటర్లో కనిపించే తేదీ ఖరారైపోయింది. నాని కాసరగడ్డని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచుకున్న డా. అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రా నికి షో రన్నర్‌గా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.
ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసిన విషయాన్ని ప్రకటించి, స్పెషల్ వీడియోను, ΄పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా మా ‘12ఎ రైల్వే కాలనీ’ని విడుదల చేయనున్నాం. ఆ వారంలో వేరే పెద్ద రిలీజులు లేకపోవడం బాక్సాఫీస్ వద్ద మా సినిమాకి అనుకూలంగా ఉంటుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ చేసినపాత్రలో పలు కోణాలున్నాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘పొలిమేర’ సిరీస్‌లో ఆకట్టుకున్న డా. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. కెమెరా: కుశేంద్ర రమేశ్ రెడ్డి. ’


