అక్షయ్‌ లక్ష్మీబాంబ్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Akshay Kumar Laxmmi Bomb Movie Trailer Released - Sakshi

ముంబై: బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లక్ష్మీ బాంబ్'  ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్‌లో అక్షయ్‌ హార్రర్‌-కామెడీ చేస్తూ తన నటనతో అందరిని ఫిదా చేశాడు. దీంతో ఆ సినిమాపై  బీ-టౌన్‌ ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగయాని  సోషల్‌ మీడియాలో ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే అర్థం అవుతోంది. ఒకవైపు లక్ష్మణ్‌గా కామెడీ పిండిస్తూ.. మరోవైపు లక్ష్మీగా హార్రర్‌తో భయపెడుతు అక్కి అద్బుతంగా నటించాడు.

దక్షిణాదిన సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’‌ పేరుతో రాఘవ లారెన్స్‌ రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తెలుగులో ట్రాన్స్‌ జెండర్‌గా సినీయర్‌ నటుడు శరత్‌ కుమార్‌ నటించగా.. హీరోగా రాఘవ లారెన్స్‌ నటించారు. కానీ ‘లక్ష్మీ బాంబ్’‌లో మాత్రం అక్షయ్‌ ద్విపాత్రలలో నటించాడు. లక్ష్మణ్‌ పేరుతో లవర్‌ బాయ్‌గా... ట్రాన్స్‌ జెండర్‌ లక్ష్మీగా భయపెడుతూ తన నటనతో ఆకట్టుకున్నాడు. (చదవండి: రికార్టు సృష్టించిన ‘లక్ష్మిబాంబ్’‌ మోషన్‌ పోస్టర్‌)

అయితే రాఘవ లారెన్స్‌ దర్వకత్వం వస్తున్న ఈ సినిమాకు తనీష్‌ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్‌ కుమార్‌లు సంగీతం అందించారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇటీవల సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభం కావడంతో లక్ష్మీ బాంబు షూటింగ్‌ పూర్తి చేసుకుని దిపావళికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది. దిపావళికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైంలో ఈ సినిమా విడుదల కానుంది. రూ. 120 కోట్లకు  ఆమెజాన్ ఈ సినిమా హక్కులను కొనుక్కుంది. ‌ అలాగే ఈ నెల 15 నుంచి థీయోటర్‌లు తిరిగి తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో సినిమాను థీయోటర్‌లలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు స్ఫష్టత లేదు. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో రికార్డు సృష్టిస్తోంది. విడుదల చేసిన 24 గంటల్లోనే 21 మిలియన్‌ వ్యూస్‌ను సంపాదించింది. (చదవండి: ‘బెల్‌ బాటమ్’‌ టీజర్‌ విడుదల చేసిన అక్షయ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top