Adipurush: Soul-Stirring Song, 'Ram Sita Ram' Is Out - Sakshi
Sakshi News home page

Adipurush Movie: తన్మయత్వానికి లోను చేసే రామ్‌ సీతారామ్‌ సాంగ్‌ రిలీజ్‌

May 29 2023 1:17 PM | Updated on May 29 2023 1:42 PM

Adipurush Movie: Soul Stirring Song Ram Sita Ram Out - Sakshi

నా రాఘవ ఎక్కడ ఉంటే అదే నా రాజభవనం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళుతుందేమో కానీ నీ జానకి వెళ్లదు' వంటి డైలాగులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. తన్మయ

రాముడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆదిపురుష్‌. లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్తా, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్‌ చిత్రాన్ని టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, క్రిష్ణకుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేశ్‌ నాయర్‌, యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. ఇటీవల రిలీజైన జై శ్రీరామ్‌ పాట ఎంత సెన్సేషన్‌ అయిందో అందరికీ తెలిసిందే! తాజాగా చిత్రయూనిట్‌ 'రామ్‌ సీతారామ్‌' పాటను విడుదల చేసింది.

సంగీత ద్వయం సచేత్‌ - పరంపర టండన్‌ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను కార్తీక్‌, సచేత్‌ టండన్‌, పరంపర టండన్‌ అద్భుతంగా ఆలపించారు. 'నా రాఘవ ఎక్కడ ఉంటే అదే నా రాజభవనం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళుతుందేమో కానీ నీ జానకి వెళ్లదు' వంటి డైలాగులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. తన్మయత్వానికి గురి చేస్తున్న రామ్‌ సీతారామ్‌ పాట జైశ్రీరామ్‌ సాంగ్‌ రేంజ్‌లో హిట్టవడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జూన్‌ 16న రిలీజ్‌ కానుంది.

చదవండి: మాజీ భార్యతో బాలీవుడ్‌ నటుడు బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement