బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత

Actress Uma Maheswari of Metti Oli fame Passes Away - Sakshi

తమిళ సినిమా: బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) ఆదివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఈమె మొట్టి ఒళి టీవీ సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా ఒరు కథైయిన్‌ కథై, మంజల్‌ మహిమై తదితర సీరియళ్లలో ప్రధాన పాత్ర పోషించారు. వెట్టి చాకిరి, కొడికట్టు, అల్లి అర్జన్‌ తదితర సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు చేశారు.

చదవండి: (ప్రాణం తీసిన చికెన్‌ గ్రేవీ, శీతల పానీయం?)

ఈమె భర్త మురుగన్‌ పశువైద్యుడు. వివాహానంతరం ఉమా మహేశ్వరి నటనకు స్వస్తి చెప్పారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నా రు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈమె మృతిపై పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలిపారు.   

చదవండి: (ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్‌ ఖాన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top