బికినీలోనే కాదు అవసరమైతే అంటూ.. బోల్డ్‌ కామెంట్‌ చేసిన హీరోయిన్‌ | Actress Shwetha Menon Bold Comments On Her Roles And Story Selection, Deets Inside - Sakshi
Sakshi News home page

Shwetha Menon Bold Comments: బికినీలోనే కాదు అవసరమైతే అంటూ.. బోల్డ్‌ కామెంట్‌ చేసిన హీరోయిన్‌

Feb 11 2024 1:01 PM | Updated on Feb 11 2024 2:19 PM

Actress Shwetha Menon Bold Comments - Sakshi

మలయాళ నటి శ్వేతామీనన్ అందరికీ గుర్తే.. 2011లో ఘన విజయం సాధించిన శృంగార ప్రేమ కథా చిత్రం'రతి నిర్వేదం' ద్వారా ఆమె తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకుంది. శ్వేతామీనన్ కీలక పాత్ర పోషించగా మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ట్రెండ్‌ సెట్‌ చేసింది. శ్రీజిత్ విజయ్‌ కథానాయకుడిగా టి.కె.రాజీవ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

యధార్థ సంఘటనలతో పి.పద్మరాజన్ రచించిన నవల 'రతినిర్వేదం' 1978లో సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అదే టైటిల్‌తో 2011లో ఆ సినిమాను శ్వేతామీనన్‌తో రీమేక్ చేశారు.  శృంగార సన్నివేశాలతో నిండిపోయిన ఈ చిత్రంలో హాట్‌హాట్‌ అందాలతో  శ్వేత అలరించింది. 1991లో మలయాళ చిత్రంలో అడుగు అడుగు పెట్టిన ఆమె గతంలో కొన్ని రొమాన్స్‌ సీన్స్‌తో పాటు బికినీలో కూడా కనిపించింది.

ఈ అంశంపై ఆమెకు తాజాగా పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలాంటి పాత్రలలో మళ్లీ నటిస్తారా అని ఆమెకు ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె ధీటుగానే సమాధానం ఇచ్చింది. 'నేను ఏ పాత్రలో నటిస్తున్నానో తెలుసుకున్న తర్వాతే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాను. సినిమాకు అవసరం అనిపిస్తే బికినీలో నటించాల్సి వచ్చినా నేను నటిస్తాను. కథాంశం కోసం అవసరమైతే మరోక అడుగు ముందుకేసి నగ్నంగా నటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.' అని శ్వేతా మీనన్‌ 50 ఏళ్ల వయసులో ధీటుగా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement