కోనసీమ వాసుల ఆదరణ మరువలేము

Actress Shanti Srihari Tributes To Sri Hari In East Godavari - Sakshi

నటి డిస్కోశాంతి, కుమారులు మేఘాన్ష్‌, శశాంక్‌ 

సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమ వాసుల ఆదరణను తాము ఎన్నటికీ మరువలేమని సినీనటుడు దివంగత శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు మేఘాన్ష్‌, శశాంక్‌లు అన్నారు.  శ్రీహరి కుమారుడు మేఘాన్ష్‌ నటిస్తున్న సినిమా చిత్రీకరణ కోనసీమలో జరుగుతున్న నేపథ్యంలో శనివారం శాంతి శ్రీహరి, మరో కుమారుడు శశాంక్‌లు అంబాజీపేట వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్‌ ఎదురుగా ఉన్న శ్రీహరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమ తండ్రిని హీరోను చేసింది ప్రేక్షకులేనని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. తమ తండ్రిపై చూపిన ఆదరాభిమానాలను తమపై కూడా చూపాలని వారు కోరారు. వారి వెంట కొర్లపాటి కోటబాబు, గంధం పల్లంరాజు, గోకరకొండ సూరిబాబు, సూదాబత్తుల రాము, శిరిగినీడి వెంకటేశ్వరరావు, సలాది రాంబాబు, ఇందుగుల ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top