పెళ్లికూతురిగా ముస్తాబైన నిత్యామీనన్‌, చూస్తే వావ్‌ అనాల్సిందే

Actress Nithya Menen Stunning Pics With White Wedding Gown Goes Viral - Sakshi

'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్‌. తర్వాత చేసిన 'ఇష్క్‌'‌ సినిమాతో యూత్‌కు ఫేవరెట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 'జబర్దస్త్‌' చిత్రంతో కాస్త తడబడ్డ నిత్య 'గుండె జారి గల్లంతయ్యిందే'తో మరోసారి కుర్రకారుల గుండెల్ని కొల్లగొట్టింది.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తన నటనతో, మధుర గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నిత్య తాజాగా పెళ్లి గెటప్‌లో దర్శనమిచ్చింది. తెల్లగా మెరిసిపోతున్న పెళ్లి గౌను ధరించి ఆమె ఫొటోలకు పోజిచ్చింది. వేలికి ఉంగరం, మెడకు చోకర్‌తో సింప్లీ సూపర్బ్‌ అనిపించుకుంటున్న ఈ ఫొటోలు చూసి పెళ్లి పీటలెక్కుతుందేమోనని తప్పులో కాలేయకండి. ఇది కేవలం ఫొటోషూట్‌ మాత్రమే..  

వైట్‌ డ్రెస్సులో చిరునవ్వులు చిందిస్తున్న నిత్య ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వెడ్డింగ్‌ డ్రెస్‌లో నిత్యను చూసిన అభిమానులు మా దిష్టే తగిలేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'కొంపదీసి పెళ్లి చేసుకుంటున్నా అంటూ షాకింగ్‌ వార్తలు చెప్పి మా గుండెను ముక్కలు చేయొద్దు' అని కొందరు ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు. కాగా గతేడాది 'బ్రీత్‌: ఇన్‌టూ ద షాడోస్'‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన నిత్య ప్రస్తుతం 'నవరస' అనే తమిళ సిరీస్‌లో తళుక్కున మెరవనుంది. మరోవైపు తెలుగులో 'గమనం'తో పాటు, మలయాళంలో '19 1 ఏ', మలయాళంలో 'కోలాంబి' సినిమాలు చేస్తోంది.

చదవండి: Actor Sai Kiran: నేను భయపడుతుంటే, కూల్‌గా ఎలా ఉన్నారు?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top