గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్‌ హీరోయిన్‌!

Actress Mandakini Photos Goes Viral On Social Media After Long Time - Sakshi

బాలీవుడ్‌ నటి మందాకిని 80, 90లోని ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెనెకళ్లతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మందాకిని ‘రామ్ తేరీ గంగా మైలీ’ మూవీతో బాలీవుడ్‌ తెరంగేట్రం చేసింది. తొలి మూవీతోనే ఫుల్‌ గ్లామర్‌ డోస్‌ పెంచి వెండితెరపై కుర్రకారును ఉర్రతలూగించింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసిన ఆమె సూపర్‌ స్టార్‌ కృష్ణ సింహాసనం మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్‌ హిట్‌గా నిలిచింది. హిందీ, తెలుగులో కలిపి ఆమె దాదాపు 30 సినిమాలు చేసింది.

ఆ తర్వాత ఆమె సినిమాలకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆమెకు ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఒక్కసారిగా తెరపై కనుమరుగైంది మందాకిని. ఈ నేపథ్యంలో ఆ మధ్య మాఫీయా డాన్‌ దావూద్‌ ఇబ్రహ్మింతో ప్రేమ వ్యవహరం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఎక్కడ ఉంది ఏం చేస్తునే దానిపై కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు దర్శనం ఇచ్చాయి. తన కుమారుడు, భర్తతో ఉన్న ఫొటోలతో పాటు తనకు సంబంధించిన ఫలు ఫొటోలను పంచుకుంది.

ఒకప్పుడు వెండితెరపై తన అందచందాలతో ఫిదా చేసిన ఆమె ఇలా ఆకస్మాత్తుగా సోషల్‌ మీడియా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ అవాక్కవుతున్నారు. తన కుమారుడి పెళ్లి ఫంక్షన్‌లో భర్తతో దిగిన ఫొటలు, కొడుకుతో సెల్ఫీ తీసుకున్న ఫొటోలతో మరిన్ని ఫొటోలను వరుసగా ఆమె షేర్‌ చేసింది. ఇంతకాలానికి ఆమె చూసిని కొందరూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొందరూ ఇప్పుడు కాస్తా వయసైయిపోయిన ఆమెను చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. దీంతో ‘ఏంటి మందాకిని ఇంతలా మారిపోయిందా!’  అంటూ నెటిజన్లు ఆమెపై పోస్టులపై స్పందిస్తున్నారు. 

చదవండి: 
హీరోయిన్‌ కాజల్‌ ఆస్తుల విలువ ఎంతంటే... 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top