నటుడు విజయకాంత్ హెల్త్‌ బులిటెన్‌ విడుదల | Actor Vijayakanth Health Bulletin Released By Chennai Miot Hospitals Management, Know His Health Condition - Sakshi
Sakshi News home page

Actor Vijayakanth Health Condition: నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Published Wed, Nov 29 2023 2:09 PM | Last Updated on Wed, Nov 29 2023 3:54 PM

Actor Vijayakanth Health Bulletin Released Miot Hospitals - Sakshi

డీఎండీకే అధినేత, సీనియర్‌ నటుడు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని మళ్లీ వార్తలు తెరపైకి వచ్చాయి. చెన్నై మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజులపాటు చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే నేతలు అప్పట్లో వివరించారు. సుమారు 10 రోజుల నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.

ఈ విషయమై వారు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు.  విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని ఇలాంటి పరిస్థితిల్లో ఆయనపై వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని వారు తెలిపారు. కానీ ఆయనకు ఇప్పటికీ కూడా ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తుండటంతో అభిమానుల్లో అనుమానం పెరిగిపోయింది. వైద్యులు ఏమైనా దాస్తున్నారా..? అంటూ ఫ్యాన్స్‌ చెప్పుకొస్తున్నారు.

ఈ పరిస్థితిలో, ఈ రోజు (29-11-2023), DMDK అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ వైద్యులు నివేదికను విడుదల చేశారు. అందులో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారని కానీ గత 24 గంటల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని అందులో తెలిపారు. వైద్యుల సూచన ప్రకారం అతనికి ఇంకా 14 రోజులు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement