
ఈ మధ్య అనారోగ్యానికి గురైన తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్.. అనారోగ్యం వల్ల ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!)
'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయినప్పటికీ గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేనందున.. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది' అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో విజయకాంత్‌ను.. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లని తొలగించారు.
(ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..)