ఆస్పత్రి నుంచి నటుడు విజయకాంత్‌ డిశ్చార్జ్‌ | Actor Vijayakanth Discharged From Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి నటుడు విజయకాంత్‌ డిశ్చార్జ్‌

Published Mon, Dec 11 2023 12:56 PM | Last Updated on Mon, Dec 11 2023 1:12 PM

Actor Vijayakanth Discharged From Hospital - Sakshi

కోలీవుడ్‌లో  కొద్దిరోజుల క్రితం ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యానికి గురైయారు. ఈ కారణంగా చెన్నైలోని మియత్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట పలు ఊహాగానాలు వచ్చిన సమయంలో ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌  విడుదల చేశాయి.

దగ్గు,జలుబు కారణంతో ఆస్పత్రిలో విజయకాంత్‌ చేరారు. చికిత్స అందిస్తున్న క్రమంలో శ్వాసకోస సంబంధిత సమస్యలను ఆయన ఎదుర్కొన్నారు. సుమారు 20 రోజులకు పైగనే ఆయన చికిత్స పొందారు.  విజయకాంత్ ఆరోగ్యంపై పలు రూమర్స్‌ రావడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు చాలాసార్లు వివరణ ఇచ్చారు.

ఆయన సతీమణి ప్రేమలత కూడా వీడియో ద్వారా కెప్టెన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రకటించారు.  ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా ఉండడంతో మరో 14 రోజుల పాటు విజయకాంత్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. నేడు (డిసెంబర్ 11)న మయత్ హాస్పిటల్ నుంచి విజయకాంత్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఆయన ఇంటికి చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement