
Actor Uttej Daughter Chetana Baby Bump Photos Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె మెటర్నటీ షూట్ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది. కాగా ఇటీవలె ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణించిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
ఇక చిత్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఉత్తేజ్ కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు.