
‘‘దర్శకుడు చిరంజీవి ‘నేనెవరు?’ చిత్ర కథ చెప్పినప్పుడు షాకయ్యా. ఇంత గొప్ప కథను కరెక్ట్‌గా తెరకెక్కించగలడా? అని సందేహపడ్డాను. కానీ, షూటింగ్‌కి వెళ్లాక అతను ఎంత జీనియస్ అన్నది అర్థం అయింది. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఈ సినిమాతో వారికి మంచి విజయం సొంతం కావాలి. నేను నటించిన మంచి సినిమాల్లో ‘నేనెవరు?’ ఒకటిగా నిలిచిపోతుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తెలిపారు.
చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెవరు?’. సరికొండ మల్లికార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు–సకినాన భూలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నేనెవరు?’ ఆడియో, టీజర్ లాంచ్ ఈవెంట్‌కి హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, దర్శకుడు వి.సముద్ర అతిథులుగా హాజరై, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప ఆర్టిస్టుతో ‘నేనెవరు?’ చిత్రం రూపొందించే చాన్స్ లభించడం మా అదృష్టం. దసరాకి మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.