సీఎం జగన్‌ అడుగు జాడల్లో నడుస్తా: అలీ | Sakshi
Sakshi News home page

నా కూతురి పెళ్లికి సీఎం జగన్‌ ఇచ్చిన కానుక ఇది: అలీ

Published Fri, Oct 28 2022 1:37 PM

Actor Ali Respond On AP Elections Media Advisor Post - Sakshi

సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కీలక పదవి దక్కిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా అలీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా అలీ స్పందించాడు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని... తన సేవలను సీఎం జగన్ గుర్తించారని చెప్పారు. 

తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు.  ఈ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు. ఈ పదవిలో అలీ రెండేళ్లు  కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీతభత్యాలు అందనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement