బిస్వాస్‌గా బచ్చన్‌.. ఫోటోలు వైరల్‌

Abhishek Bachchan Shoots For Bob Biswas In Kolkata, Pics Go Viral - Sakshi

కోల్‌కతా : అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తోన్న థ్రిల్లర్ సినిమా బాబ్ బిస్వాస్ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభమయ్యింది. కహానీ చిత్రంలోని కాంట్రాక్ట్‌ కిల్లర్‌ బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో అభిషేక్‌ నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన కహానీ చిత్రంలోని కోల్డ్‌ బ్లడెడ్‌ కిల్లర్‌గా బిస్వాస్‌ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రముఖ బెంగాలీ నటుడు సస్వతా ఛటర్జీ పోషించిన ఈ పాత్రలో తాజగా అభిషేక్‌ నటించునున్నారు.  ఇందుకోసం  ఫుల్‌ స్లీవ్‌ చొక్కా, పెద్ద కళ్లజోడు, మిడ్‌ పార్టీషియన్‌ జుట్టుతో కనిపిస్తున్న అభిషేక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.(కేజీఎఫ్‌.. ఛాప్టర్‌: 2: అధీరా రెడీ..)

కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమయ్యింది.  షారుక్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుజోయ్‌  ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో  పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్‌కి కరోనా కారణంగా బ్రేక్‌ పడింది.  ఆ తర్వాత అభిషేక్‌ సైతం కోవిడ్‌ బారినపడి తిరిగి కోలుకున్నారు. అభిషేక్‌ సరసన చిత్రాంగఢ సింగ్ నటిస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ అతికొద్దిమంది నటీనటులతో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. (నిర్భయపై వెబ్‌ సిరీస్‌కు అంతర్జాతీయ అవార్డ్‌)
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top