సినిమాల కంటే పుస్తకాలకే ప్రాధాన్యం: ఆమిర్‌ ఖాన్‌ | Aamir Khan Shares Childhood Memories: bollywood | Sakshi
Sakshi News home page

సినిమాల కంటే పుస్తకాలకే ప్రాధాన్యం: ఆమిర్‌ ఖాన్‌

Apr 1 2026 2:51 AM | Updated on Apr 1 2026 2:51 AM

Aamir Khan Shares Childhood Memories: bollywood

సాధారణంగా నటీనటులు, దర్శక–నిర్మాతలు, సాంకేతిక నిపుణులు... ఇలా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా సినిమాలకే మా తొలి ప్రాధాన్యం అంటుంటారు. అయితే బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ మాత్రం ‘నేను సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గురించి ఎవరికీ పెద్దగా తెలియని ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి, అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ‘‘నేను చాలా సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న ఎంతో క్రమశిక్షణతో పెంచారు.

సినిమాలు చూసే విషయంలో కఠినంగా ఉండేవారు. కేవలం దూరదర్శన్ లో వచ్చే పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా వారాంతంలో సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను సరే అంటే ఓకే... లేదంటే లేదు. అయితే రొమాంటిక్‌ లేదా కమర్షియల్‌ సినిమాలు చూడటానికి అనుమతించేవారు కాదు. దీంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. 

ఈ కారణంగా చిన్నతనం నుంచే పుస్తకాలతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే 18 ఏళ్లకే నేను అసిస్టెంట్‌గా ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించాను. ఆ తర్వాత హీరోగా మారాను. కానీ నేను ఇప్పటికీ పెద్దగా సినిమాలు చూడను. కొందరికి ఫుట్‌బాల్‌ ఆడటం ఇష్టం.. మరికొందరికి చూడటం ఇష్టం. నేను ఆడే రకం. సినిమాలు చేస్తాను కానీ చూడను’’ అని చెప్పా రు ఆమిర్‌ ఖాన్‌. ఇదిలా ఉంటే ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్న ‘ఏక్‌ దిన్‌’ మే 1న, ‘లాహోర్‌ 1947’ ఆగస్టు 13న విడుదల కానున్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement