
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తన కుమారుడిని పాస్ మార్కులు తెచ్చుకునేందుకు ఓ తల్లి పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి వెల్లడించారు. ఈ టీచర్స్ డే కానుకగా బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తన కుమారుడికి 35 మార్కులు వచ్చేందుకు ఓ మాతృమూర్తి పడిన తపన, కష్టాన్ని ఇందులో చక్కగా చూపించారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మరోసారి ఈ అద్భుతమైన సినిమా చూసే అవకాశం ఆడియన్స్కు దక్కనుంది. ఈ మూవీని రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన సంగతి తెలిసిందే.
Teachers are our first storytellers, life guides and the reason we carry values that last forever.
This Teacher’s Day, September 5th, we celebrate them through the film that touched countless hearts — #35ChinnaKathaKaadu 💛
Join us in theaters to honor every teacher who shaped… pic.twitter.com/wwUZDc7VAl— Rana Daggubati (@RanaDaggubati) September 2, 2025