● లోధా కుల సమస్యలపై బీసీ కమిషన్ విచారణ
● త్వరలో ప్రభుత్వానికి నివేదిక: చైర్మన్ నిరంజన్
పాపన్నపేట(మెదక్): గ్రౌండ్ లేని బడులకు ఈసారి సమగ్ర శిక్ష నిధుల్లో కోత పెట్టారు. మైదానం లేని బడులకు కొంత మేర నిధులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏటా క్రీడా వికాసానికి నిధులు కేటాయిస్తున్నా, మైదానం లేక, ఆటలు ఆడించక, క్రీడా పరికరాలు మూలనపడుతున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో నిధుల దుబారాను అరికట్టే చర్యల్లో భాగంగా కోత విధించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో మైదానం లేని పాఠశాలలు 34
జిల్లాలో మొత్తం 933 పాఠశాలలుండగా, 34 పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేవు. ఇందులో 31 ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత, 2 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా కొన్ని పాఠశాలల్లో గ్రౌండ్ లేకున్నప్పటికీ, ఉన్నట్లుగా యూ డైస్ రికార్డుల్లో చూపారన్న ఆరోపణలున్నాయి. కాగా ఇంతవరకు మైదానం ఉన్న ప్రాథమిక పాఠశాలకు రూ. 5 వేలు, లేకుంటే రూ.4 వేలు మంజూరు చేసేవారు. ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రౌండ్ ఉంటే రూ.10 వేలు, లేకుంటే రూ.7 వేలు, ఉన్నత పాఠశాలలో రూ.25 వేలు, గ్రౌండ్ లేకుంటే రూ.15 వేలు ఇస్తున్నారు. అలాగే ఒక్క విద్యార్థి లేని బడులకు, 10 మంది లోపు విద్యార్థులు ఉన్న బడులకు క్రీడా నిధులు ఇవ్వడం లేదు. ఈ నిధులతో విద్యార్థులకు ఇండోర్ గేమ్స్, అవుట్‌డోర్ గేమ్స్, వ్యాయామాలకు సంబంధించి క్రీడా పరికరాలు కొనాల్సి ఉంటుంది. కాగా, ఎలాంటి కోతలు పెట్టకుండా, పాఠశాలలకు నిధులు ఇస్తే, కనీసం ఇండోర్ గేమ్స్‌కు సంబంధించి ఆట వస్తువులైనా కొనుగోలు చేయొచ్చునని హెచ్‌ఎంలు అంటున్నారు. ఈ విషయమై పాపన్నపేట ఎంఈఓ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా.. నిధుల్లో కోత విధించినట్లు తెలిసిందన్నారు.
పథకాలు అందుతున్నాయా?
పెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్రవ్యాప్తంగా లోధా కులాల వారి సమస్యలపై బీసీ కమిషన్ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నట్లు చైర్మన్ నిరంజన్ తెలిపారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో లోధా, లొద్ద కుల సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారి పూర్వీకుల వివరాలు, కుల వృత్తి, వ్యాపారాలు, ఇంటిపేర్లు, వివాహాలు, అంత్యక్రియలు, కుల ఆచారాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా..? బీసీ కుల ధ్రువపత్రాలు వినియోగంలో ఉన్నాయా..? కుల వివక్షత గురించి వివరాలు సేకరించారు. తమకు ప్రత్యేక రిజర్వేషన్‌తో పాటు ఉద్యోగాలు, కుల వివక్షత లేకుండా చూడాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు, రిజర్వేషన్లు అందించాలని లోధా కులస్తులు విన్నవించారు. ప్రభుత్వానికి బీసీ కమిషన్ ద్వారా లోధా కుల సమస్యలౖపై నివేదిక అందిస్తామని, నెల రోజుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ స్కీంలపై అవగాహన సమావేశం నిర్వహించాలని కలెక్టర్, బీసీ అధికారులను చైర్మన్ ఆదేశించారు. బీసీ సర్టిఫికేట్ రాకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోల్ జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ క్రాంతికుమార్, సర్పంచ్ జంగం రేణుక, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి, కుల సంఘం నాయకులు రమేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


