క్రషర్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

క్రషర్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దు

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

వెల్దుర్తి(తూప్రాన్‌): గ్రామ శివారు సర్వే నంబర్‌ 580లోని గుడిబండపై కంకర మిషన్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొదంటూ మండలంలోని కుకునూర్‌ గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు. బుధవారం అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జిల్లా మైనింగ్‌ అధికారితో పాటు వెల్దుర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. క్రషర్‌ మిషన్‌ ఏర్పాటు చేయడం వల్ల గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంతాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాయిలు, మాజీ జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement