‘పేట’ మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

‘పేట’ మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ మృతి

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

‘పేట’ మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ మృతి ‘భగీరథ’ నీటి సరఫరాలో అంతరాయం సకాలంలో రేషన్‌ బియ్యం అందించాలి బీజేపీ జెండా ఆవిష్కరణ మోదీ పాలనలోనే దేశాభివృద్ధి అవసరమైతే న్యాయ సాయం

రామాయంపేట(మెదక్‌): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామాయంపేట మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ మామిడి దేవేందర్‌ ఆదివారం రాత్రి మృతి చెందారు. మున్సిపల్‌ ఎన్నికలకు ముందు వరకు రామాయంపేట కమిషనర్‌గా పనిచేసిన ఆయన, అనారోగ్యంతో సెలవుపై వెళ్లిపోయారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గజవాడ లావణ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ నవనీత, కౌన్సిలర్లు, మున్సిపల్‌ మేనేజర్‌ రఘువరన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

నర్సాపూర్‌: రెండు రోజుల పాటు మిషన్‌ భగీరథ తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ ప్రవీణ్‌కుమార్‌, ఏఈ సురేశ్‌ తెలిపారు. చెక్రియాల్‌ నుంచి వచ్చే మెయిన్‌ పైపులైన్‌కు లీకేజీ ఏర్పడిందని, మరమ్మతులు చేయించాల్సి ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం నుంచి నీటి పంపింగ్‌ నిలిచిపోతుందని వివరించారు. కాగా మంగళ, బుధవారం వరకు నీటి సరఫరా ఉండదన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్థానికంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం సకాలంలో లబ్ధిదారులకు అందించాలని మెదక్‌ ఆర్టీఓ రమాదేవి సూచించారు. సోమవారం పట్టణంలోని పలు రేషన్‌ దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని సకాలంలో అందించాలని డీలర్లకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డీలర్లపై, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట మెదక్‌ తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు తదితరులు ఉన్నారు.

మెదక్‌జోన్‌: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌రెడ్డి, సీనియర్‌ నేతలు సుభాశ్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్‌, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్‌, యువ మోర్చా అధ్యక్షుడు సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి

హత్నూర(సంగారెడ్డి): దేశ అభివృద్ధి బీజేపీ పాలనలోనే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హత్నూర మండలం దేవులపల్లిలో పార్టీ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తున్నాయని చెప్పారు. బీజేపీ పాలనలోనే దేశం పురోగతి సాధించిందన్నారు. గ్రామాలకు కూడా పార్టీ విస్తరిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్‌, నాయకులు మల్లారెడ్డి, మహేష్‌, మల్లేశం, నాగరాజుగౌడ్‌, పాండు, ఇంద్రసేనారెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి టౌన్‌: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నా రు. సోమవారం సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌ పేట పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోక్సో, మహి ళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామన్నారు. లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వారి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement