సత్వర పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం చూపండి

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

ప్రజావాణికి 98 వినతులు

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజావాణిలో వచ్చిన వినతులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకూడదన్నారు. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలను అర్జీదారుడికి లిఖితపూర్వక వివ రణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి 98 వినతులు స్వీకరించారు. అనంతరం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 99 రోజుల కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ యూ నస్‌, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement