● నేను చేసిన పనులఆధారాలు చూపుతా..
● మీరేం చేశారో ఎమ్మెల్యే చెప్పాలి
● మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్: రెండున్నరేళ్లలో ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, ఏ ఒక్క రోడ్డు పనులు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన పనులకు ఆధారాలు ను చూపుతామని, దమ్ముంటే ఎమ్మెల్యే చూపాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా ఏడేళ్లలో రూ.350 కోట్లతో మండల కేంద్రాలకు, గ్రామాలకు రోడ్లు వేయించానని గుర్తు చేశారు. రెండు జాతీయ రహదారుల విస్తరణకు రూ.900 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. తాను మంజూరు చేసిన ఇతర పలు పనులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రద్దు చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపాదనలే తప్ప పనులు లేవన్నారు. హ్యామ్ కింద చేపట్టే రోడ్లకు ముందుగానే కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇవ్వడం కమీషన్ల కోసమేనని ఆరోపించారు. రూ.800 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా తాము ఇంటింటికీ తాగునీటిని అందిస్తే నిర్వహణ చేతగాక పథకం ఫెయిల్యూర్ అంటున్నారని విమర్శించారు. ఖేడ్, మనూరు మండలాల పార్టీ అధ్యక్షులు పరమేష్, విఠల్‌రావు, పట్టణ అధ్యక్షులు నగేష్, సర్పంచ్‌లు వెంకటేశం సిద్దు, నాయకులు సంగప్ప, మల్గొండ పాల్గొన్నారు.


