ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్): మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సూచించారు. సోమవారం రామాయంపేట మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏకై క కొనుగోలు కేంద్రం రామాయంపేటలోనే ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, నిజాంపేటలో కూడా కేంద్రం ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య, కౌన్సిలర్లు నాగరాజు, రవి, రంజిత్, సందీప్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాపు యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చింతల స్వామి, డీసీసీ ఉపాధ్యక్షుడు దేమె యాదగిరి, జిల్లా కార్యదర్శి పోచమ్మల గణేశ్, తహసీల్దార్ రజని, సహకార సంఘం సీఈఓ నర్సింలు, పలు గ్రామల సర్పంచ్‌లు పాల్గొన్నారు.


