పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని గాంధారిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను ఈనెల 7న నిర్వహించే బహిరంగా వేలం ద్వారా విక్రయించనున్నట్లు తహసీల్దార్ సతీశ్ తెలిపారు. గ్రామ శివారులో 34 ట్రిప్పుల ఇసుక, సుమారు 102 క్యూబిక్ మీటర్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఏడీ మైనింగ్ సూచనల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు రూ.10 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఒక వేల 34 ట్రిప్పుల కన్నా ఎక్కువ ఇసుక ఉంటే దానికి సంబంధించి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
గిరి ప్రదక్షిణం.. ఆధ్యాత్మిక పరిమళం
వర్గల్(గజ్వేల్): నాచగిరి భక్తులతో పోటెత్తింది. శ్రీలక్ష్మీనృసింహుని జన్మనక్షత్రం ‘స్వాతి’ నక్షత్ర మహోత్సవ వేళ శనివారం అశేష భక్తజన ‘గిరి’ ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గిరి ప్రదక్షిణ సంరంభం ఆద్యంతం ‘గోవింద’ నామంతో మార్మోగింది. హరి నామస్మరణతో మునిగితేలుతూ భక్తజనులు ప్రదక్షిణ పూర్తిచేశారు.


