ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ట్రాక్ సూట్లు..
గురుకుల విద్యార్థులకు ‘ఎడ్యుకేషన్ కిట్లు’
జిల్లాలో 84 వేలమందికి ప్రయోజనం
ఈవీఎంల భద్రత కీలకం
కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటానికి ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీలలో భాగంగా శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎంల గోదాంను సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, డబుల్ లాక్ సిస్టమ్ వంటి అంశాలను పరిశీలించారు. గోదాం వద్ద నియమించిన భద్రతా సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
6 నుంచి హెల్త్ వీక్ కార్యక్రమం
ఈనెల 6 నుంచి 11 వరకు నిర్వహించే హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వారితో సమావేశం నిర్వహించారు. ఎయిడ్స్, కేన్సర్, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, ఎనీమియా, మత్తు పదార్థాల నిర్మూలన లాంటి అనేక వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా కనీసం 50 శాతం మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వచ్చే విద్యాసంవత్సరం
నుంచి అందజేత


