మెదక్‌జోన్: జనగణన శిక్షణ వాయిదా వే యాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధు అన్నారు. ఈమేరకు సంఘం నాయకులతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనంలో ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈనెల 10 నుంచి 18 వరకు ఎస్‌ఏ–2 పరీక్షలు ఉండడం, ఈనెలలోనే ఓపెన్ టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈఅంశాలను దృష్టిలో ఉంచుకొని జనగణనకు సంబంధించి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం ఇబ్బ ందికరంగా మారుతుందన్నారు. బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని జనగణనకు సంబంధించి ఈనెల 23 తర్వాత శిక్షణ ఇవ్వాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా కోశాధికారి మంగ నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షుడు గడిల మాధవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.


