వారిది అనైతిక పొత్తు: ఎమ్మెల్యే సునీతారెడ్డి | - | Sakshi
Sakshi News home page

వారిది అనైతిక పొత్తు: ఎమ్మెల్యే సునీతారెడ్డి

Feb 17 2026 8:48 AM | Updated on Feb 17 2026 8:48 AM

వారిది అనైతిక పొత్తు: ఎమ్మెల్యే సునీతారెడ్డి

వారిది అనైతిక పొత్తు: ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌: నర్సాపూర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి కోసం కాంగ్రెస్‌, బీజేపీలు అనైతికమైన పొత్తు పెట్టుకున్నాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీల నాయకులు పదవుల కోసం అనైతికంగా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు పొత్తు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. కాగా ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ పాలక మండలికి తన పూర్తి సహకారం అందిస్తానని సునీతారెడ్డి చెప్పారు. ఆమె వెంట ఆ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement