అందరి చూపు కొర్విపల్లి వైపు
చిన్నశంకరంపేట(మెదక్): ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు స్వగ్రామమైన కొర్విపల్లిలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే చిన్నాన్న మైనంపల్లి రాధాకిషన్‌రావు బరిలో నిలిచారు. గతంలో ఇక్కడ రాధాకిషన్‌రావు తండ్రి లక్ష్మణ్‌రావు రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. ఎమ్మెల్యేతో విభేదాలతో శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా సర్పంచ్‌గా బరిలో నిలిచారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకుడు కాంతినేని పుల్లారావును ఎమ్మెల్యే బరిలో నిలిపారు. గ్రామ అభివృద్ధికి తాను సర్పంచ్‌లా పనిచేస్తానని మైనంపల్లి హన్మంతరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇంటిపోరు పంచాయతీ పోరుగా మారడంతో అందరు కొర్విపల్లి ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే చిన్నశంకరంపేటలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ చంద్రశేఖర్, ముదిరాజ్ సంఘం బలపర్చిన ఏమ దుర్గపతి మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇక్కడ దుర్గపతికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి ఫలితం యువత, మహిళ ఓటర్ల తీర్పుపై ఆధారపడడంతో ఉత్కంఠగా నెలకొంది.


