పటిష్ట బందోబస్తు: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి విడత ఎన్నికలకు ఎలాంటి ఘటనలు తవులేకుండా నిష్పక్షపాతంగా జరగడంలో పోలీసు అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికలకు అన్నిరకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
మెదక్ కలెక్టరేట్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) జనవరి, ఫిబ్రవరి– 2026కు సంబంధించి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 19లోగా సంబంధిత ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి సమాచారం కోసం కలెక్టరేట్‌లోని డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


