మంత్రిని కలిసిన నూతన సర్పంచ్‌లు | - | Sakshi
Sakshi News home page

మంత్రిని కలిసిన నూతన సర్పంచ్‌లు

Dec 13 2025 10:41 AM | Updated on Dec 13 2025 10:41 AM

మంత్ర

మంత్రిని కలిసిన నూతన సర్పంచ్‌లు

మంత్రిని కలిసిన నూతన సర్పంచ్‌లు కేసీఆర్‌ హయాంలోనే గ్రామాల అభివృద్ధి డైట్‌ కళాశాలకు కొత్త భవనం 15న పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

టేక్మాల్‌(మెదక్‌): మండలంలో నూతనంగా గె లిచిన సర్పంచ్‌లు శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలోని తన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం సర్పంచ్‌లు మంత్రిని సన్మానించారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే బీఆర్‌ఎస్‌ బలపరిచిన ఆభ్యర్థులను గెలిపించాలని నర్సా పూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ కృషితోనే గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయన్నారు. ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమణాగౌడ్‌, నాయకులు హరికృష్ణ, కృష్ణాకర్‌రావు, యాదగౌడ్‌, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నాగేశ్వర్‌రావు, ప్రవీణ్‌ గౌడ్‌, కల్లూరి వెంకటేష్‌, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, రాజేందర్‌నాయక్‌, నరేశ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల కేంద్రంలోని డైట్‌ కళాశాల పక్కన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలె న్సీలో భాగంగా రూ. 11 కోట్లతో కొత్త భవనం నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రస్థాయి అధికారుల బృందం శుక్రవారం స్థల పరిశీలన చేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రా ష్ట్ర చీఫ్‌ ఇంజనీర్‌ షఫీమియా, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డివిజనల్‌ ఇంజినీర్‌ నర్సింహాచారి, డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాధాకిషన్‌, రవీందర్‌ ఉన్నారు.

నర్సాపూర్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 15న పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని ఆర్డీఓ, జిల్లా డిప్యూటీ ఎలక్షన్‌ ఆఫీసర్‌ మహిపాల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడో విడతలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు కల్గిన గ్రామంలో ఓటు వేయొచ్చన్నారు. కాగా ఈనెల 15న ఆయా మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేయాలని, అదే రోజు బ్యాలెట్‌ పొంది ఓటు వేసి ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఎన్నికల విధుల ఆర్డర్‌ కాపీ చూపాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా డివిజన్‌ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు.

నర్సాపూర్‌: మున్సిపాలిటీ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌శాఖ ఏడీఈ రమణారెడ్డి, ఏఈ రాంమూర్తి తెలిపారు. సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు చేపడుతున్నామని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

మంత్రిని కలిసిన  నూతన సర్పంచ్‌లు 
1
1/2

మంత్రిని కలిసిన నూతన సర్పంచ్‌లు

మంత్రిని కలిసిన  నూతన సర్పంచ్‌లు 
2
2/2

మంత్రిని కలిసిన నూతన సర్పంచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement