సమన్వయంతోనే విజయవంతం
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్/హవేళిఘణాపూర్(మెదక్): అన్నిశాఖల సమన్వయంతో మొదటి విడత ఎన్నికలు సజావుగా ముగిశాయని, రెండు, మూడో విడత ఎన్నికలను కూడా అదే రీతిలో జరిగేలా పని చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓ, తహసీల్దార్, పోలింగ్ అధికారులతో గూగుల్ మీట్ ని ర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యాశాఖ నుంచి పెద్ద ఎత్తున పా ల్గొన్న టీచర్లకు జిల్లా పంచాయతీ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ అయిపోగానే కౌంటింగ్ ప్రక్రియ జాగ్రత్తగా జరగాలని తెలిపారు. వేగవంతంగా జరిగేందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా వెంటనే అయిపోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో రెండో విడత ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలని కలెక్టర్ కోరారు.


