సంకుల సమరమే
మెజార్టీ పంచాయతీల్లో ఇదే పరిస్థితి
వెల్దుర్తి(తూప్రాన్): గత అనుభవాలు, క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పంచాయతీ ఎన్నికల పోరు, సం‘కుల’ సమరంగా మా రింది. పల్లెల్లో కులాలు, వర్గాల ప్రాతిపదికనే సమీకరణలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మెజారిటీ పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా, కులాలవారీగా సమావేశాలు, విందులు జోరందుకున్నాయి. పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండగా, అభ్యర్థి కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గెలిచాక ఏదో ఒక పార్టీ వంచన చేరే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల గుర్తులతో అభ్యర్తులు ప్రజలను కలుస్తూ తనకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
పార్టీల ప్రభావం అంతంతే..
అసెంబ్లీ ఎన్నికలు పార్టీ కేంద్రంగా జరిగితే పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా అభ్యర్థి కేంద్రంగా జరగుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే. పచ్చని పల్లెల్లో రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో పార్టీలకు సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేని గుర్తులనే కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండానే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
కులాల వారీగా అభ్యర్థులు
సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ఆయా గ్రామాల్లో కులాలవారీగా పెద్దలు రంగంలోకి దిగారు. ఎక్కువ మంది సంఘ సభ్యులున్నచోట తమ అభ్యర్థిని బరిలో నిలిపారు. పోటీ అధికంగా ఉన్న చోట ఆశావహుల నడుమ రాజీ కుదుర్చి ఒక్కరే బరిలో ఉండేలా చూసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రానివారికి రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అవకా శం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వగా కొందరూ పోటీకి దూరంగా ఉన్నారు. మరికొందరు మాత్రం బరిలో నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొన్నిచోట్ల సంఘ పెద్దలు తమ కులానికి చెందిన అభ్యర్థి విజయం కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
పార్టీల ప్రభావం అంతంతే..
అభ్యర్థి కేంద్రంగానే ఎన్నికలు


