ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి
మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో గల టీఎం టైర్స్ సంస్థ చిన్న షెడ్డు నిర్మాణానికి అనుమతి తీసుకొని పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టాలని, కంపెనీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కల్లు డిపో తొలగించండి
పాపన్నపేట మండలం కొడుపాక హనుమాన్ ఆలయం పక్కన ఏర్పాటుచేసిన కల్లు డిపోను వెంటనే తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆలయ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారని వాపోయారు. మరోవైపు మురికి కాల్వను సైతం పూడ్చారన్నారు.
							ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
