పాఠశాల విద్యార్థులకు పోటీలు
నేటి నుంచి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
సృజనాత్మకత పెంపునకు కృషి
నారాయణఖేడ్: విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం, సృజనాత్మకత, ఆరోగ్యకరమైన పోటీని ప్రొత్సహించేందుకు గాను ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల విభాగం (సాఫ్ట్‌నెట్), టీ–శాట్‌ల సహకారంతో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల 13వ తేదీ వరకు వివిధ స్థాయిల్లో ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు మండల స్థాయిల్లో పాఠశాలల్లో పోటీలు నిర్వహించాలని పాఠశాలల విద్యా డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఉత్తర్వులు ఆలస్యంగా అందడంతో పాఠశాలల స్థాయిలో మంగళ వారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలకు అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియతో పాటు పోటీల వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపించారు. విద్యాశాఖ నుంచి పాఠశాలల స్థాయికి ఆలస్యంగా ఈ ఉత్తర్వులు వెళ్లాయి. జిల్లా విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఎంఈఓలు, పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు. జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలు 191, ఉన్నత పాఠశాలలు 211 కొనసాగుతున్నాయి. వీటిల్లో 6 నుంచి పై తరగతుల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించనున్నారు.
వివిధ విభాగాల్లో..
పోటీలు మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో వివిధ విగాల్లో నిర్వహించనున్నారు. ఈనెల 4వ తేదీ వరకు మండల స్థాయి పాఠశాలల్లో. 5వ తేదీ నుంచి 8 వరకు జిల్లా, 9, 10 తేదీల్లో జోనల్ స్థాయి (ఆన్‌లైన్‌లో)లో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి ల్లో ఫైనల్స్‌ను ఈనెల 12, 13 తేదీల్లో హై దరాబాద్‌లోని టీ–శాట్ ప్రాంగణంలో నిర్వహించను న్నారు. వ్యాసరచన పోటీతో విద్యార్థుల్లో విషయం పట్ల సృజనాత్మకత పెరుగుతుంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
