ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మెదక్ ఎంపీ రఘునందన్
నర్సాపూర్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. సోమ వారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మిర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ బాధ్యత తీసుకోవాలని కోరారు. పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 86 వేల మంది మృతి చెందారని, లక్ష మంది క్షతగాత్రులైనట్లు ఓ సర్వేలో వెల్లడైందని వివరించారు. రోడ్డు సేఫ్టీ అథారిటీకి చైర్మన్‌ను నియమించాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు బుచ్చెశ్‌యాదవ్, ఆంజనేయులుగౌడ్, నారాయణరెడ్డి, సతీష్‌యాదవ్, చంద్రయ్య, రాజు, రాంరెడ్డి పాల్గొన్నారు.
పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహేందర్‌రెడ్డి
మెదక్‌జోన్: పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వంగ మహేందర్‌రెడ్డి నియామకయ్యారు. ఈమేరకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేడి సతీశ్‌రావు, సౌమ్యానాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసిన మహేందర్‌రెడ్డి యూనియన్ అభివృద్ధి కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆయనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం హర్షణీయం అన్నారు.
15న జాతీయ లోక్ అదాలత్
సంగారెడ్డి టౌన్: ఈనెల 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి న్యాయవాదులు సహకరించాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సంగారెడ్డి టౌన్: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిందని, రైతులకు పెట్టుబడి రాక తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి రూ. 30 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే చెరుకు టన్నుకు రూ. 4,500 ప్రకటించాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్టారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి
మెదక్ కలెక్టరేట్: సింగూర్ ప్రాజెక్ట్ మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందు న సాగు, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మెదక్ సిటిజన్ ఫోరం నాయకులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటిని పూర్తిగా తొలగిస్తారు కాబట్టి మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. కావున ప్రత్యామ్నయ ఏర్పాటు చేయాలని విన్నవించారు.
							ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
							ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
