రంగంలోకి సిండికేట్లు
రంగంలోకి సిండికేట్లు వ్యక్తిగతంగా వ్యాపారులు టెండర్ వేసే పరిస్థితి లేకపోవడంతో కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి వైన్స్ దరఖాస్తులు చేస్తున్నారు. గౌడ్‌లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం వైన్‌షాపులు రిజర్వ్ చేసినప్పటికీ, వారి పేరిట దళారులే దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, హైదరాబాద్‌తో పాటు పేరొందిన ఓ వైన్స్ గ్రూపు పేరిట 50 నుంచి 100 వరకు భారీ టెండర్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారం ఈ గ్రూపులకు చెందిన కొంతమంది వ్యాపారులు దరఖాస్తులు చేసినట్లు సమాచారం. స్థానిక వ్యాపారులు సైతం కొంతమంది కలిసి సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 15 వరకు దరఖాస్తులు వేస్తున్నారు.
వైన్స్ వ్యాపారంలో వచ్చిన లాభాల్లో సుమారు 30 శాతం మామూళ్లకు, ఇతరత్ర ఖర్చులు తడిసి మోపెడ వుతున్నాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వైన్‌షాపు లైసెన్స్ ఫీజుకు 10 రెట్ల అమ్మకం వరకు లిక్కర్‌పై 20 నుంచి 27 వరకు లాభాలు ఉంటాయి. పరిమితి ముగియగానే 10 శాతం టర్నోవర్ టాక్స్ వసూలు చేస్తారు. ఆ తర్వాత స్పెషల్ రిటేల్ టాక్స్ పేరిట ఏటా రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ఈసారి రూ. 3 లక్షలకు పెంచినందున లిక్కర్ పరిమితిని 10 రెట్ల కన్నా ఎక్కువ పెంచాలని వ్యాపారులు కోరుతున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నేపథ్యంలో వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారనే ఆశతో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. గతేడాది టార్గెట్ రీచ్ కావడానికి వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. జిల్లాలో 2021లో 832 దరఖాస్తులు రాగా రూ. 16.64 కోట్లు, 2023లో 1,905 దరఖాస్తులు రాగా రూ. 38.10 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది దరఖాస్తులకు 12 రోజుల వ్యవధి ఇవ్వగా, ఈసారి 24 రోజులు ఇచ్చారు. అయినా ఇప్పటివరకు 373 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే ఈసారి రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడం, గత వ్యాపారులకు ఆశించిన రీతిలో లాభాలు రాకపోవడంతో దరఖాస్తులు మందకొడిగా సాగుతున్నాయని అంటున్నారు. కానీ చివరి రెండు రోజుల్లోనే సిండికేట్‌ల జాతర మొదలవుతుందని, గతేడాది టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏపీ, హైదరాబాద్ వ్యాపారుల ఎంట్రీ చివరిరోజు భారీగా దరఖాస్తులకుఅవకాశం జిల్లాలో 49 దుకాణాలకు373 అప్లికేషన్లు
జిల్లాలో మద్యం టెండర్లు మందకొడిగా సాగుతున్నాయి. గత నెల 26న నోటిఫికేషన్ వెలువడగా, గురువారం సాయంత్రం వరకు 373 దరఖాస్తులు అందినట్లు ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 49 వైన్‌షాపులు ఉండగా, గతేడాది 1,905 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఏపీ, హైదరాబాద్ సిండికేట్లు రంగంలోకి దిగడంతో ఈనెల 18 చివరి రోజు దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
– మెదక్ అర్బన్
లాభాల్లో 30 శాతం మామూళ్లకే
గతేడాది టార్గెట్ చేరేనా!
మద్యం దుకాణాల కోసం ఏకం