
హెచ్‌ఎంతో పాటు ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
నర్సాపూర్ రూరల్: హెచ్‌ఎంతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రాధాకిషన్ గురువారం తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన హెచ్‌ఎం రాజప్ప నిధుల దుర్వినియోగానికి పాల్పడగా, మరో ఇద్దరు ఉపాధ్యాయులు అశోక్, లక్ష్మయ్య తరచూ విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. అయితే వారి నుంచి హెచ్‌ఎం లంచాలు తీసుకొని వేతనాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు స్కావెంజర్ వేతనంలోనూ కోతల విధిస్తూ నిధులు కాజేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉన్నతస్థాయి అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టి విచారణ చేయగా నిధుల దుర్వినియోగం, ఉపాధ్యాయుల గైర్హాజరు, తరచూ గొడవలు జరుగుతున్నట్లు తేలింది. ఈ మేరకు వారిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన
రామాయంపేట(మెదక్): డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఇమ్యూనైజేషన్ అధికారిణి మాధురి గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈసందర్భగా హెల్త్ వర్కర్లకు ఇచ్చే హెపటైటీస్ బీ వాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, ప్రగతి ధర్మారం ప్రా థమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు హరిప్రియ, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు.