
కంపు.. భరించలేకపోతున్నాం
పాఠశాల ఎదుటే పౌల్ట్రీఫాం దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగ జ్‌మద్దూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ఎదుట ఉన్న పౌల్ట్రీఫాం నుంచి వెదజల్లే దుర్వాసనతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల పలువురు విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందా రు. దుర్వాసనతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మెదడుకు ఎక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడో తరగతి విద్యార్థి నికిత్‌సాయి ఇటీవలే ఆస్పత్రిలో చేరగా, సుందరయ్య అనే ఉపాధ్యాయుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో పాఠశాల అంటేనే విద్యార్థులు, ఉపాధ్యాయులు జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిచా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

కంపు.. భరించలేకపోతున్నాం