
ప్రజలతో సత్సంబంధాలు అవసరం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండాలని ఎస్పీ శ్రీనివాస్‌రా వు అన్నారు. గురువారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌లు నమోదు చేసిన కేసులపై క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రతి కేసును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ వ్యవస్థను క్రీయాశీలంగా నిర్వహించాలన్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఎస్‌ఐ సృజనకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి రోజు వాహనాల తనిఖీ చేపట్టడంతో పాటు అనుమానాస్పద వాహనాలను అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తనతో నేరుగా మాట్లాడాలని సూచించారు. అనంతరం నార్సింగి మల్లన్నగుట్ట వద్ద ఉన్న పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్‌రెడ్డి, సీఐ వెంకటరాజంగౌడ్, ఎస్‌ఐ సృజన ఉన్నారు.
సైబర్ మోసగాళ్ల వలలో చిక్కొద్దు
మెదక్ మున్సిపాలిటీ: ఆఫర్ల మోజులో పడి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా నకిలీ వెబ్‌సైట్లు, లింకులు పంపి ప్రజలను మోసం చేస్తుంటారని తెలిపారు. ఆ లింక్‌ల ద్వారా షాపింగ్ ఆఫర్లు, లాటరీలు, గిఫ్ట్ కూపన్లు వంటి ప్రలోభాలు చూపి డబ్బులు వసూలు చేస్తారన్నారు. ఇలాంటి ఫేక్ లింక్‌లు, వెబ్‌సైట్లకు వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు