
జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
పాపన్నపేట(మెదక్): మండలంలోని లింగాయపల్లి చీకోడ్ ఉన్నత పాఠశాల విద్యార్థి రూపొందించిన ప్రాజెక్ట్ జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ంది. పదో తరగతి విద్యార్థి శివ చైతన్య రూపొందించిన ఆధునిక మల్టీ పర్పస్ అడ్వాన్స్ హైడ్రాలిక్ జేసీబీ అండ్ ఆల్ ఇన్ వెహికల్ ఎగ్జిబిట్ జిల్లా, రాష్ట్ర, దక్షిణ భారత స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసి జాతీయ విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జాతీయస్థాయికి ఎంపికై ంది. భోపాల్‌లో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొననున్నారు. కాగా విద్యార్థికి గైడ్‌గా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న కిషన్ ప్రసాద్‌వ్యవహరించారు.