
సేవాభావం అలవర్చుకోవాలి
ఏఎస్పీ మహేందర్
హవేళిఘణాపూర్(మెదక్): చదువుతో పాటు సేవాభావం పెంపొందించుకోవాలని ఏఎస్పీ మహేందర్ విద్యార్థులకు సూచించారు. మండల పరిధిలోని ముత్తాయికోటలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను కూడా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌నేనని, కష్టపడే అలవాటు అప్పటి నుంచే ఏర్పడిందన్నారు. రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగావకాశాలు పొంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్, ప్రిన్సిపాల్ హుస్సేన్, పంచాయతీ సెక్రటరీ హేమంత్, కిరణ్‌గౌడ్, రఘుబాబు, ప్రోగ్రాం ఆఫీసర్ మురళి, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో ఉన్నత
శిఖరాలకు చేరుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంజేపీ బీసీ గురుకుల సొసైటీ ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని తునికి ఎంజేపీ గురుకుల పాఠశాలలో అండర్–17 కబడ్డీలో పరుశురాం, వాలీబాల్‌లో హేమంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో అభినందించారు. ఈసందర్భంగా ఆర్‌సీఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హరిబాబు, పీడీ అంజలి, పీఈటీలు కార్తీక్, శేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా కౌడిపల్లిలోని ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందిన సిద్దార్థ్ అండర్– 14 ట్రిపుల్ జంప్‌లో ప్రథమస్థానం, ఇంటర్ విద్యార్థి నరేందర్ నాయక్ షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
అనుమానితులు
కన్పిస్తే సమాచారం ఇవ్వాలి
నర్సాపూర్: అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ ప్రజలను కోరారు. బుధవారం ఉదయం పట్టణంలోని చైతన్యపురి కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని హితవు పలికారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా సరైన డాక్యుమెంట్లు లేని 59 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని సీఐ జాన్‌రెడ్డి చెప్పారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేస్తే అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రంగకృష్ణ, వెంకటరాజాగౌడ్, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డితో పాటు ఏడుగురు ఎస్‌ఐలు సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు.
దుర్గమ్మ దర్శనానికి వేళాయే
పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి ముస్తాబవుతోంది. 60 రోజులుగా మంజీరా వరదల్లో మునిగిన ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహ ంతో ఆలయం పూర్తిగా దెబ్బతింది. క్యూలైన్లు, రేకులు, ఫ్లోరింగ్, గ్రానైట్ దెబ్బతిన్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్ కొట్టుకుపోయింది. సుమా రు రూ. కోటిన్నర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. కాగా విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. రెండు రోజుల్లో దర్శనాలు ప్రారంభం కావొచ్చని ఆలయ వర్గాలుతెలిపాయి.

సేవాభావం అలవర్చుకోవాలి

సేవాభావం అలవర్చుకోవాలి