
గాలికుంటు నివారణకు టీకాలు
నర్సాపూర్ రూరల్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని నర్సాపూర్ డివిజన్ పశువైద్యాధికారి జనార్దన్ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కొండాపూర్, పెద్దచింతకుంటతో పాటు నర్సాపూర్‌లో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. మూడు గ్రామాల్లో కలిపి 186 పశువులకు టీకాలు వేసినట్లు చెప్పారు. ప్రతి ముందు జాగ్రత్తగా పశువులకు టీకాలు వేయించాలన్నారు. ఇందుకోసం అన్ని గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పశు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు సౌమిత్ కుమార్, స్వప్న, ఆంజనేయులు, వీరేశం, వెంకటేశ్, ఏసుప్రభు పాల్గొన్నారు.
నర్సాపూర్ డివిజన్ పశువైద్యాధికారి జనార్దన్