
పోషకాహార లోపాన్ని నివారిద్దాం
రామాయంపేట(మెదక్): మెదక్‌ను పోషకాహారలోపం లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని డీడబ్ల్యూఓ హేమభార్గవి అన్నారు. ఐడీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణమాస వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాల విషయమై బాలికలు, వారి తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. పోషణలోపం, బాల్య వివాహాలను అరికట్టడానికి ముందుకెళ్తున్నామని వివరించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్థానికంగా లభ్యమవుతున్న పండ్లు, ఆకుకూరలను తినాలని సూచించారు. ముఖ్యంగా ఆకుకూరలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, వీటిలో పోషణ విలువలు అధికంగా ఉంటాయని వివరించారు. పోషణ వారో త్సవాలకు సంబంధించి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీడీపీఓ స్వరూప, పలు మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
డీడబ్ల్యూఓ హేమభార్గవి