
సంగారెడ్డిలో సందడే..
సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో ఉత్సవాల ఏర్పాట్లు..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పండగను పురస్కరించుకుని పాతబస్టాండ్ రాంమందిర్ నుంచి శావ శోభాయత్ర నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో భజన కీర్తలతో ఈ శోభయాత్ర ఉంటుంది. రాంమందిర్ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అంబేద్కర్ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. భారీ స్థాయిలో బాణాసంచ కాల్చుతారు. పట్టణ వాసులతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుల బృందాలు పాడే భక్తిగీతాలు వేడుకకు హాజరైన వారిలో ఆధ్మాత్మిక భావాన్ని పెంపొందిస్తుంటాయి.