దహనమవుతున్న రావణుడి ప్రతిమ
మెదక్‌జోన్/మెదక్‌మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా దసరా పండుగను గురువారం ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఉదయమే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాలకు సైతం పూజలు చేయించారు. సాయంత్రం వేళ ఊరంతా ఒకచోట చేరి పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. జమ్మిచెట్టుకు శమీ పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పా టు చేసిన రావణవధ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్‌రావు హాజరయ్యారు. రావణుడి ప్రతిమకు నిప్పుపెట్టి వేడుకలను ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మల్లికార్జున్‌గౌడ్, నాయకులు ఆంజనేయులు, మ్యాడం బా లకృష్ణ, గంగాధర్, బీజేపీ నేత గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామా లయంలో జరిగిన ప్రత్యేక పూజలో కలెక్టర్ రాహుల్‌రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అంతకుముందు రాందాస్ చౌరస్తాలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
దసరా సంబురం