
పరిషత్ పోరుకు కసరత్తు
సంగారెడ్డి జోన్: పరిషత్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తాజాగా పరిషత్తు స్థానాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు. ఒక్కో అంశంపై ఒక్కో అధికారిని పర్యవేక్షించే విధంగా బాధ్యతలను అప్పగించారు.
261 ఎంపీటీసీ.. 25 జెడ్పీటీసీ స్థానాలు
జిల్లాలో 25 మండలాల పరిధిలో 613 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 261 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాలకు పోరు జరగనుంది. రెండు విడతలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి విడతలో జహీరాబాద్‌తో పాటు నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ఉన్న 141 ఎంపీటీసీ స్థానాలు, 13 జెడ్పీటీసీ స్థానాలకు, రెండో విడతలో అందోల్, సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్ నియోజకవర్గంలోని 12 జెడ్పీటీసీ, 120 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే 1,458 కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో 1,748 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
పేరు అధికారి హోదా అంశం
వెంకటేశ్వర్లు విద్యాశాఖ సిబ్బంది నియామకం
అభిలాష్‌రెడ్డి సాంఘిక సంక్షేమ బ్యాలెట్ బాక్సులు
అరుణ జిల్లా రవాణాశాఖ రవాణా
రామాచారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిక్షణ కార్యక్రమాలు
స్వప్న డిప్యూటీ సీఈఓ సామగ్రి పంపిణీ
జగదీష్ బీసీ సంక్షేమశాఖ ఎన్నికల ప్రవర్తన, నియమావళి
బలరాం ఆడిట్ అధికారి వ్యయ పరిశీలన
సూర్యారావు అదనపు డీఆర్‌డీఓ రిపోర్టులు సమర్పణ
బాలరాజ్ అదనపు డీఆర్‌డీఓ బ్యాలెట్, పోస్టల్ పేపర్ ముద్రణ
ఏడుకొండలు డీపీఆర్‌ఓ మీడియా కమ్యూనికేషన్
సాయిబాబా డీపీఓ హెల్ప్‌లైన్, ఫిర్యాదుల కేంద్రం
చలపతిరావు హౌసింగ్, పీడీ అబ్జర్వర్
12 మంది నోడల్ అధికారులను
నియమిస్తూ ఉత్తర్వులు
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ
ఇప్పటికే ఓటరు,
పోలింగ్ కేంద్రాల జాబితా