
పండుగ కిక్కు
కొల్చారం(నర్సాపూర్): ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరాకు ‘కిక్కు’ అదిరింది. ఈనెల 2న దసరా రావడం అదే రోజు గాంధీ జయంతి ఉండడంతో ముందస్తుగానే మద్యం దుకాణాదారులు అమ్మకాలు చేపట్టారు. జిల్లాలోని కొల్చారం మండలం చిన్నఘనాపూర్ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం (ఐఎంఎల్ డిపో) ద్వారా పండగకు ముందు గత నెల 29, 30 ఈనెల 1 (ఈ మూడు రోజుల్లో) ఏకంగా రూ. 22.17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. వీటిలో 23,714 కేసుల లిక్కర్, 18,988 కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 3.57 కోట్ల అధిక మద్యం అమ్ముడైంది.