
జోరుగా పూల విక్రయాలు
శివ్వంపేట(నర్సాపూర్): సోమవారం సద్దుల బతుకమ్మ కావడంతో పూల అమ్మకాలు జో రుగా సాగుతున్నాయి. కొనుగోలుదారులతో శివ్వంపేటలో సందడి నెలకొంది. కిలో బంతిపూలు రూ. 90 నుంచి 120 వరకు వ్యాపారులు విక్రయించారు.
మహాసభల కరపత్రం ఆవిష్కరణ
మెదక్ కలెక్టరేట్: మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో ఆదివారం సీఐటీయూ మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జిల్లాలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల కరపత్రాలను రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభ లకు విస్తృత ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, మల్లికార్జున్, ఆహ్వాన సంఘం వైస్ చెర్మన్ అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, మహేందర్‌రెడ్డి, నాగరాజు, బస్వరాజు, సంతోశ్, గౌరయ్య, మల్లేశం, అజయ్, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

జోరుగా పూల విక్రయాలు