
నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్సీ (4 ఇందులో 2 మహిళలకు), ఎస్టీ (2 ఇందులో ఒకటి మహిళ) కేటాయించడినట్లు చెప్పారు. బీసీలకు 9 స్థానాలు రిజర్వ్ కాగా, 4 మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. మిగితా 6 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 3 స్థానాలు మహిళలకు కేటాయించామని వివరించారు. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.