
విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి
నర్సాపూర్ రూరల్: విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషాచారి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు చెడు స్నేహం చేయకుండా లక్ష్యంతో చదువుకోవాలన్నారు. డ్రగ్స్, మత్తు పానీయాలకు దూరంగా ఉండి ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు జోత్స్న దేవి, నాగరాజు, రామ్ రెడ్డి, హరీష్, భాగ్యలక్ష్మి, అనిల్, కళింగ రెడ్డి, రమాదేవి, అతిక్ ఫాతిమా, అభినవ్, రాజేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల
ప్రిన్సిపాల్ శేషాచారి